𝗔 𝘄𝗶𝗱𝗲-𝗿𝗮𝗻𝗴𝗲 𝗼𝗳 𝗼𝘁𝗵𝗲𝗿 𝘀𝗶𝗱𝗲 𝗱𝗶𝗺𝗲𝗻𝘀𝗶𝗼𝗻𝗮𝗹 𝘃𝗶𝗲𝘄 𝗼𝗻 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗣𝗵𝗶𝗹𝗼𝘀𝗼𝗽𝗵𝘆

■ || Deep analysis of our Indian philosophy and its other dimensionality with wide-range of philosophical ideas for contemporary modern India  || ■

||మన భారతీయ తాత్వికచింతన మరియు దాని మరో కోణపు విశ్లేషణ||
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
● భారతదేశం అంటే కేవలం ఒక అధ్యాత్మిక భూమి మాత్రమేనా?
● భారతదేశం అంటే కేవలం దేవుడు మాత్రమేనా? 
● భారతదేశం అంటే కేవలం కర్మ భూమి మాత్రమేనా?
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
భారతీయ తాత్వికచింతన మరో కోణంలో విశ్లేషిస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం...

■ ప్రపంచంలో భారతీయ తాత్విక చింతన ఎందుకు గొప్పదో తెలుసా? 
■ మన పూర్వీకులు విమర్శనాత్మక ధోరణికి ఎంతవరకు ప్రాధాన్యతనిచ్చారు మీకు తెలుసా?

● మన భారతీయులు (పూర్వం) విమర్శకు పెద్ద పీట వేశారు (మన౼పూర్వీకులు) నిజానికి మనం ఆధునిక రోజుల్లో అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా మనలో చాలా వరకు విమర్శనాత్మక ధోరణి చచ్చిపోయింది.....కానీ, ఒకప్పుడు మన భారతీయ తాత్వికచింతనలో విమర్శనాత్మక ధోరణి కీలక పాత్ర పోషించింది.... అందులో భాగంగా అప్పటికే వైదిక తత్వాలు చలామణిలో ఉన్నాయి ఈ వైదిక తత్వాల వలన యజ్ఞయాగాలు,పూజలు,అశ్వమేధ యాగం,కుల వ్యవస్థ మరియు బలిదానాలు ఆ రోజుల్లో ఇలాంటి అశాస్త్రీయమైన ధోరణలు చాలా ఉండేవి... అయితే ,ఈ వైదిక తాత్వికచింతన ఆధ్యాత్మికం వలన కొన్ని మూఢ నమ్మకాలు కూడా ఆవిర్భవించాయి... వీటిని విమర్శించడానికి పుట్టిన తాత్వికచింతనలే అవైదిక భారతీయ తాత్వికచింతనలు...
అందులో ముఖ్యముగా చార్వాకుం,అజీవకాం,బౌద్ధుం మరియు జైనం పుట్టుకొచ్చాయి...ఇవి వైదికంగా ఏర్పడిన మూఢనమ్మకాలను గట్టిగా విమర్శనాత్మక ప్రశ్నలు చేధించాయి.... ఇందులో భాగంగా వైదిక తత్వం సంస్కరణకు గురైంది...ఎక్కడైతే విమర్శనాత్మక ధోరణి ఉంటుందో అక్కడ,ఆ నాగరికత సమాజం సంస్కరణ చెంది ఆధునికతకు దారితీస్తుంది...ముఖ్యంగా బౌద్ధం వైదిక మూఢనమ్మకాలను విమర్శించింది... అంటరానితనం,కులవ్యవస్థ, యాజ్ఞయాగాలు,పూజలు మరియు దేవుడి పేరుతో బలిదానాలు అలాగే అశాస్త్రీయమైనటువంటి ధోరణులు విమర్శించాడు సిద్ధార్థ గౌతముడు... ఈయన వలన మన భారతీయ తాత్విక చింతన ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలకు దారి తీసింది...
మన భారతదేశం కేవలం అధ్యాత్మిక భూమి మరియు కర్మభూమి అనుకుంటే పొరపాటు పడినట్టు... మన పూర్వీకులు అన్నింటికీ సమానంగా విలువ ఇచ్చారు... అందులో భాగంగా మన పూర్వీకులు నాస్తికులు, భౌతిక వాదులు గా చార్వాకతత్వం (Materialistic School of Indian Philosophy), అజీవకతత్వం(School of Absolute determinism), బౌద్ధతత్వం (Reasoning and Rationalistic School of Indian Philosophy),జైనతత్వం(Rationalistic Heterodox School of Indian Philosophy)అలాగే వైదిక తత్వం లో ఉండి కూడా నాస్తికులుగా, హేతువాదులు గా పేరుపొందిన సాంఖ్యతత్త్వం(Rationalist and Atheistic School of Indian- Philosophy)కూడా ఉన్నాయి కాబట్టి మన దేశం ఒక అధ్యాత్మిక దేశం మాత్రమే అనుకుంటే పొరపాటు పడినట్టే ఇలాంటి అవైదిక తత్వచింతనల వలన ఆధ్యాత్మిక ప్రపంచం మెరుగుపడి సంస్కరణకు చెందింది కాబట్టి, భారతదేశంలో ఆధ్యాత్మికతను కూడా వ్యతిరేకించిన తత్వాలు వెలిశాయి...

నాకు తెలిసి ప్రపంచంలో ఏ తాత్వికచింతనలలో కూడా ఇంత విస్తారమైన ఆలోచనలు ఇంత లోతైన ఆలోచనా, ఇంతటి విమర్శనాత్మకమైన ధోరణులు కలిగిన తాత్వికచింతనలు కేవలం భారతీయ తాత్వికచింతనకే సాధ్యం...

ఇందులో భాగంగా గౌతమ సిద్ధార్థ సధించిన కొన్ని విప్లవాత్మకమైన మరియు విమర్శనాత్మకమైన ఆలోచనలు లు ఈ క్రింది విధంగా ఉన్నాయి, ఇలాంటి విమర్శనాత్మక ధోరణి వలన మన భారతీయ నాగరికత ఎంతో సంస్కరణకు మరియు ఆధునికతకు గురైంది...

● సిద్ధార్థ గౌతమ (భారతీయ తత్వవేత్త) తన సమకాలీన కాలంలో భారతీయ ఆధ్యాత్మికతపై కొన్ని విమర్శనాత్మక అభిప్రాయాలను ప్రతిపాదించారు మరియు అతని హేతువాద అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి

 ---------------------------------------------------------

 1. అతీంద్రియా శక్తులపై నమ్మకం ధర్మం కాదు.

 2. దేవుని పై నమ్మకం తప్పనిసరిగా ధర్మ స్థాపన యొక్క భాగం కాదు.

 3. బ్రహ్మం తో ( దేవుడు ) తో కలయిక మరియు మోక్షం ఆధారంగా ధర్మం కాదు.

 4. ఆత్మపై నమ్మకం ధర్మం కాదు.

 5. బలిదానాలు పై నమ్మకం ధర్మం కాదు.

 6. ఊహాజనితమైన ఆధారంగా నమ్మకం ధర్మం కాదు.

 7. మత పుస్తకాలు చదవడం ధర్మం కాదు.

 8. మత ప్రాతిపదికన పుస్తకాల నుంచి లభించిన విషయాలపై నమ్మకం ధర్మం కాదు.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
● Siddhartha Gautama (Indian Philosopher) gave few critic views on Indian spiritualism during his contemporary time  and his rationalistic views were👇🏻
---------------------------------------------------------
1. Belief in the supernatural is Not Dhamma.
2. Belief in God is not essentially the part of Dhamma.
3. Dhamma based on Union with Brahma is Not Dhamma.
4. Belief in Soul is Not Dhamma.
5. Belief in sacrifices is Not Dhamma.
6. Belief based on speculation is Not Dhamma.
7. Reading books of religion is Not Dhamma. 
8. Belief in the infallibility of Books of Religion is Not Dhamma.

-----------------------------------------------------------
మీ హరి ప్రసాద్
𝙃𝙖𝙧𝙞𝙥𝙧𝙖𝙨𝙖𝙙
🙏🙏🙏🙏

Comments