𝗠𝗮𝗻𝗴𝗮𝗿𝗮𝘆𝗮 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗔𝗱𝗼𝗻𝗶
మంగరాయ ఆంజనేయ స్వామి వారి ప్రాచీన దేవాలయం యాదవగిరి సంస్థానం - యాదవాని - ఆదోని.
- ఈ దేవాలయములో ఆంజనేయ స్వామి సంముఖముగా దర్శనం ఇస్తారు అంటే స్వామివారు పూర్తిగా భక్తుల వైపు తిరిగి ఉంటారు
( కాకపోతే మిగిలిన ఆలయాలలో ఆంజనేయ స్వామి వారి ముఖము ఒకవైపు మాత్రమే చూస్తాము) సంముఖముగా ఉన్నందువల్ల ఈ దేవాలయం చాలా విశిష్టం కలిగినది.
విజయనగర రాజ్య సైనిక చ్నిహం
-----------------------------------------
- రాజ్య హంస - ఐరావత - సింహ కేసరి వీరోచిత బల ప్రదర్శన.
దేవాలయ పరిసరాలలోని చారిత్రక శాసనం ద్వారా ఈ గుడి వ్యాస రాయులచే ప్రతిష్టించబడిన
"శ్రీ మంగరాయ హనుమాన మందిరం" 𝟏𝟓వ శతాబ్దం 𝐀𝐃 - ఆదోని.
ఈ దేవాలయము వెనకనే మరో ప్రాచీనమైన ఆలయం ఉన్నది ఆ ఆలయం పేరు ' శ్రీ వజ్రగిరి ఆంజనేయ స్వామి దేవాలయం' దీనిని జీర్ణో ధారణ చెయ్యబోతున్నారు, ఈ దేవాలయం 'శ్రీ జనమే జయ మహారాజు' చేత నిర్మించబడిన శ్రీ బద్రీనాథ్ దేవాలయ సింహ భాగమును దర్శనమిస్తూ ఉన్నటువంటిది అత్యంత ప్రాచీన దేవాలయం ఇది.
ఈ దేవాలయం పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉన్న కారణంగా మరల జీర్ణోదారణము చేయు సంకల్పించినారు కావున, భక్త మహాశయులందరూ తమ తమ సహకారం అందించి ధన, వస్తు రూపములలో శ్రీ మంగరాయ ఆంజనేయ స్వామి దేవాలయంలో కంకర్యము చేసుకోవచ్చు.
ముఖ్యగమనిక :
శ్రీ మంగరాయ ఆంజనేయ స్వామి దేవాలయం విజయనగర రాజుల కాలంలో ప్రతిష్టించబడినది.
ఈ దేవాలయం విజయనగర రాజుల కాలంలో ద్వైత సిద్ధాంత మద్వాచార్య తత్వం ప్రబోధించిన
శ్రీ వ్యాసరాయుల చేత ప్రతిష్టించబడినది.
శ్రీ వ్యాస రాయుల పూర్వజన్మ అవతారం ప్రహల్లాదుడిగా అలాగే వ్యాసరాయుల తర్వాతి జన్మ అవతారం గా శ్రీ రాఘవేంద్ర స్వామిగా జరిగినది.
శ్రీ మంగరాయ ఆంజనేయ స్వామి దేవాలయం మార్గశిర మాస పౌర్ణమి రోజున ప్రతిష్టించబడినది.
హరి ప్రసాద్ 𝐊 🌹🖊️
Comments
Post a Comment