● ప్రాచీన భారతీయ భౌతికవాదులు ౼ చార్వాకులు ■ 𝗗𝗼𝗰𝘁𝗿𝗶𝗻𝗲 𝗮𝗻𝗱 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗢𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗠𝗮𝘁𝗲𝗿𝗶𝗮𝗹𝗶𝘀𝗺-𝗖𝗮𝗿𝘃𝗮𝗸𝘀 𝗮𝗻𝗱 𝗛𝗼𝘄 𝘁𝗵𝗲𝘆 𝙪𝙨𝙚𝙙 𝙩𝙤 𝗳𝙞𝙜𝙝𝙩 𝗮𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝗿𝗶𝘁𝘂𝗮𝗹 𝘀𝘆𝘀𝘁𝗲𝗺 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗻𝗮𝗺𝗲 𝗼𝗳 𝗲𝗰𝗹𝗶𝗽𝘀𝗲 𝗶𝗻 𝗮𝗻𝗰𝗶𝗲𝗻𝘁 𝗜𝗻𝗱𝗶𝗮𝗻

ఈ రోజు సూర్య గ్రహణం సందర్భంగా  చిన్న  భారతీయ తాత్వికత కథ చెబుతాను ఇది కేవలం కథ కాదు నిజం కూడా
( గ్రహణం భారతదేశంలో కనిపించదు )

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

● అజితకేస కంబలి 
( The one who wears blanket made up of hairs) ప్రాచీన భారతదేశంలో ఈయన చార్వాక తత్వాన్ని స్థాపించాడు... ప్రాచీన భారతదేశంలో చార్వాకులు నాస్తికులు వేదాలను నమ్మలేదు ఆత్మలను నమ్మలేదు కర్మసిద్ధాంతాన్ని అసలుకే నమ్మలేదు... వీళ్ళని ప్రాచీన భారతీయ భౌతికవాదులు అంటారు 
(Doctrine and School Of Indian Materialism) వీళ్లు వేదాల ద్వారా వైదికంగా ఏర్పడిన మూఢనమ్మకాలను గట్టిగా ఎదిరించి పోరాడారు... అయితే  గ్రహణ సమయాలలో ఆ రోజులలో భారతదేశంలో దేవాలయాలు తెరిచేవారు కాదు అది ఇప్పటికీ ఉన్న ఆచారమే కాకపోతే చార్వాకులు మాత్రం దేవాలయాల ముందు కూర్చొని గ్రహణాన్ని వీక్షించి వారు గ్రహణ సమయాలలో వీరు దేవాలయాల దగ్గర స్థావరాలు ఏర్పాటు చేసుకుని తినుబండారాలు తినేవారు... గ్రహణ సమయాలలో ఆచరించే మూఢనమ్మకాలు తప్పు అని గట్టిగా విమర్శించే వాళ్ళు వీళ్ళు... అజితకేశ కంబలి బుద్ధుడు మరియు మహావీర సమకాలీనుడు... ప్రాచీన భారతదేశంలో చార్వాకుల ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచం ఎంతో సంస్కరణ చెందింది మూఢనమ్మకాలను వదిలేసి ఆధునికతకు దారితీసింది వీళ్ల ఆలోచనలు వల్లే... వీళ్ళను ప్రాచీన భారతీయ భౌతికవాదులు మరియు సుఖంకారులు ( Hedonists ) అంటారు... వీళ్లు నాస్తికులు,హేతువాదులు అలాగే వీళ్లు సుఖంకారాలు కాబట్టి మనం వీళ్ళను తప్పుగా చూస్తాం కానీ అది ఎంతవరకు సమంజసం కాదు వీళ్ళు నిజానికి చాలా సాధారణమైన జీవితం గడిపారు
( Ascetic Way of Life ).... చూసారా ప్రాచీన భారతదేశంలో విమర్శకు ఎంత పెద్ద పీట వేశారో మన పూర్వీకులు... ప్రాచీన భారతదేశం లో వీళ్ళు చేసిన విమర్శల కన్నా వేరే తత్వాలు వీళ్ళ మీద విమర్శలు చేసిందే ఎక్కువ.... మన భారతదేశంలో ఏ తత్వం కూడా వీళ్లంతా విమర్శకు గురికాలేదు....
( Carvakas were highly critisised by other Schools of Indian Philosophical Doctrines)
 నిజానికి మత బోధనలు బోధించే వాళ్లకన్నా  మతం లో ఉండే మూఢనమ్మకాలను విమర్శించే వారి వల్లే మనం నిస్సందేహంగా ఆధునికతకు గురవుతాం....ప్రాచీన భారతదేశంలో ఆధునిక విజ్ఞానానికి బీజాలు వేసింది చార్వాకులే....

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


మీ హరి ప్రసాద్

🙏

Comments

Popular posts from this blog

The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴