● 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗣𝗵𝗶𝗹𝗼𝘀𝗼𝗽𝗵𝗶𝗰𝗮𝗹 𝘁𝗵𝗼𝘂𝗴𝗵𝘁𝘀 𝗮𝗻𝗱 𝗶𝘁'𝘀 𝗮𝗽𝗵𝗼𝗿𝗶𝘀𝗺 𝗼𝗳 𝗮𝗿𝘁𝗶𝗰𝘂𝗹𝗮𝘁𝗲𝘀 𝘀𝗲𝗿𝗶𝗲𝘀 - 𝟮

𝗦𝗮𝗺𝗸𝗵𝘆𝗮 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗼𝗳 𝘁𝗵𝗼𝘂𝗴𝗵𝘁
(𝗩𝗲𝗱𝗶𝗰 𝗔𝘁𝗵𝗲𝗶𝘀𝗺, 𝗢𝗿𝘁𝗵𝗼𝗱𝗼𝘅 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗔𝘁𝗵𝗲𝗶𝘀𝘁𝗶𝗰 𝗣𝗵𝗶𝗹𝗼𝘀𝗼𝗽𝗵𝗶𝗰𝗮𝗹 𝗦𝗰𝗵𝗼𝗼𝗹)
● 𝗧𝗵𝗲 𝗼𝗻𝗹𝘆 𝘀𝗰𝗵𝗼𝗼𝗹 𝗣𝗿𝗼𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗱 𝘁𝗼 𝗯𝗲 𝗥𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹𝗶𝘀𝘁𝗶𝗰 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗣𝗵𝗶𝗹𝗼𝘀𝗼𝗽𝗵𝘆.

భారతీయ తాత్వికచింతనలో కొత్త ధోరణి ప్రదర్శించినా సాంఖ్య దర్శనము. 

మనం ఒకసారి భారతీయ తత్వశాస్త్రం గనక గమనిస్తే నాస్తిక వాదం కూడా బలమైనది అనే విషయం నమ్మదగినది అయితే, నాస్తిక వాదాన్ని బలపరిచిన తత్వాలు వేదాలను తిరస్కరించాయి. కాకపోతే, ఒక్క సాంఖ్య దర్శనం దీనికి భిన్నమైనది వీళ్లు వేదాలను ప్రామాణికంగా తీసుకొని నాస్తికవాదం ని బలపరిచారు. 

వీళ్లు నాస్తికులు అలాగే వీళ్లు హేతువాదులు.
భారతీయ తత్వశాస్త్రంలో చాలా దర్శనాలు హేతువాదాన్ని బోధించాయి కాకపోతే దాన్ని బలపరిచి గట్టిగా బోధించింది మాత్రం సాంఖ్య తత్వమే. అందుకే వీళ్ళని 
"భారతీయ హేతువాద దృక్పథపు తత్వ దర్శనం" అని కూడా అంటారు.
 
ఇంతటి విభిన్నమైన తత్విక స్పృహ కలిగిన వీళ్ళు ఇంకా కొన్ని విషయాల్లో భిన్నత్వానికి ప్రదర్శించారు.

ముఖ్యంగా, అప్పటికే భారతీయ తాత్వికచింతనలో విరాజిల్లిన ఆలోచనలను గమనిస్తే సగటు భారతీయుడు గర్వ పడాల్సిందే.

మధ్యయుగానికి ప్రపంచంలో నలుమూలలా వేరే మతస్తులు తమ మతంలో నాస్తికులు ప్రశ్నిస్తే వాళ్లను హతమార్చి చంపే వాళ్ళు. కాకపోతే, అంతకు ముందే అంటే దాదాపు క్రీస్తుపూర్వం కాలంలోనే మనదేశంలో నాస్తికత్వానికి ఎంతో పెద్ద పీట వేశారు మన పూర్వీకులు. సాంఖ్య తత్వము పూర్తిగా హేతువాద దృక్పథం కలిగినది అయితే వీళ్ళలో నాస్తిక వాదం కూడా ముఖ్యమైన అంశం. కాకపోతే భారతదేశంలో నాస్తికవాదాన్ని, భౌతికవాదానికి పెద్దపీట వేసింది మాత్రం చార్వక తత్వ దర్శనం మాత్రమే వీళ్ళు పూర్తిగా నాస్తికులు, 
భౌతికవాదులు. 

సాంఖ్యుల  విశ్వ ఆవిర్భావ ఆలోచనలు గురించి తెలుసుకుంటే ఇవాళ్టి ఆధునిక విజ్ఞానానికి వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు దాదాపు సమానమనే అనవచ్చు.

మద్యయుగానికి భారతదేశం వెలుపల సృష్టివాదాన్ని మాత్రమే బలపరిచిన మతాలు అనే విషయం మనం గమనించవచ్చు ఎవరైనా విశ్వ ఆవిర్భావం గురించి చర్చిస్తే వాళ్లను శిక్షించి, చంపేవాళ్ళు.

మధ్యయుగానికి ఎన్నో సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వమే మన దేశంలో సృష్టివాదాన్ని తప్పు అని చెప్పి ఆవిర్భవ వాద సిద్ధాంతం బోధించింది సాంఖ్యులు మాత్రమే  ఈ కొత్త ధోరణి మిగిలిన భారతీయ వైదిక దర్శనాలకు పూర్తిగా వ్యతిరేకమైనది, భిన్న మైనది.

ఈ విశ్వం మొత్తం నిర్జీవ స్థితి నుంచే ఆవిర్భవించిందని ప్రబోధించారు వీళ్ళు. ఇకపోతే, మిగిలిన వైదిక దర్శనములు మాత్రం జీవస్థితి నుంచి ఆవిర్భవించిందని చెప్పుకొచ్చారు.
 
అందరికీ భిన్నంగా సాంఖ్య సిద్ధాంతం ఇవాళ్టి ఆధునిక విజ్ఞానానికి ఎంతో సరిసమానం పోలిక ఉంది, కాకపోతే వీళ్లు కొన్ని తత్విక పదజాలలను వాడారు అందులో విశ్వ ఆవిర్భావం గురించి "పక్రితి" మరియు "పురుష" అనే  తాత్విక పదాలను మనం వీళ్ళ తత్వశాస్త్రంలో గమనించవచ్చు.

సాంఖ్యతత్వ శాస్త్రం స్థాపించింది కపిలుడు వీళ్లు మాయవాదాన్ని తిరస్కరించి ఈ విశ్వం మొత్తం భౌతికమే అని చెప్పుకోవచ్చారు.

సాంఖ్యులు వేసిన భారతీయ తాత్విక బీజాలు ఇవాల్టి ఈ ఆధునిక ప్రపంచానికి మరియు అలాగే నేటి ఆధునిక విజ్ఞానానికే స్పూర్తి దాయకం.


𝑰𝒏𝒅𝒊𝒂𝒏 𝒑𝒉𝒊𝒍𝒐𝒔𝒐𝒑𝒉𝒊𝒄𝒂𝒍 𝒍𝒆𝒂𝒇𝒍𝒆𝒕𝒔 𝒍𝒐𝒓𝒆 𝒃𝒚

𝓗𝓪𝓻𝓲𝓹𝓻𝓪𝓼𝓪𝓭 ✍️🖌️
హరి ప్రసాద్ 

Comments

Popular posts from this blog

The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴