Tip-off Inside Story and Critisism Of Jai Bheem Movie

Karl Marx , Ambedkar and Periyar సిద్ధాంతాలు ఒకటి కావు
● జై భీమ్ అనగా పాళి భాషలో జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం (ఆ కాలానికి సంస్కృతంతో పాటు పాళి భాష కూడా వాడుకలో ముందు ఉండేది) భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితం బౌద్ధం తారస్థాయిలో ఉన్న రోజులలో బుద్ధుడు ఈ పదాన్ని ప్రవేశపెట్టాడు ఆ సమకాలిన సామాజిక కాలానికి బుద్ధుడు తీసుకువచ్చిన ప్రజాస్వామిక విలువలు,సమానత్వం,సమాన న్యాయం వీటన్నిటికీ సూచనగా జై భీమ్ గా పిలుచుకునేవారు. అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత మళ్లీ ఈ పదాన్ని వాడుకలో తీసుకువచ్చాడు. ఈ సినిమాలో కొండ ప్రాంత గిరిజనుల కష్టాల గురించి వాళ్లను కూడా విద్యా అర్హత కల్పించి,సమానమైన న్యాయ చట్టాలు వాళ్ళకి కూడా అందేలా చూపించాలని మంచి సందేశం దర్శకుడు ఇచ్చాడు ఇది నిజంగా మెచ్చుకోవచ్చు కాకపోతే, ఇదేదో కేవలం Left wing కమ్యూనిస్టు పార్టీ మాత్రమే దీనిని సాధించగలదు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ఎంతో గొప్పవి గా చిత్రీకరించడం పెరియార్ ని అంబేద్కర్ని కార్ల్ మార్క్స్ ను ఒకేచోట తీసుకువచ్చి వాళ్ళందరి సిద్ధాంతాలు ఒక్కటే అని చూపించి ప్రజలను మభ్య పెట్టాడు దర్శకుడు.
నిజానికి చెప్పాలంటే కమ్యూనిస్టు భావజాలం చాలా ప్రమాదకరమైనది వాళ్లు మాత్రమే స్వతంత్ర పరమైన ఆలోచనలు కలిగిన వాళ్ళని వాళ్లు మాత్రమే పోరాటం చేసి సమానమైన న్యాయ చట్టాలను తీసుకు వస్తారు అని ప్రజలు అనుకోవాలని చిత్రీకరించాడు దర్శకుడు. ఒకసారి మనం చరిత్ర చదివితే కమ్యూనిస్టు భావజాలం ద్వారా కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇక మిగిలిన అంబేద్కర్ భావజాలం మాత్రం మెచ్చుకోదగినది, ఆయన బౌద్ధాన్ని ఆశ్రయించింది హిందూమతంలో ఉన్న వివక్షను వదిలేయడానికి కమ్యూనిస్టు భావజాలాన్ని తీసుకురావడానికి కాదు.
 అలా అయితే ఆయన నిజంగా అసలు మతాన్ని స్వీకరించకూడదు కమ్యూనిస్టు భావజాలం ప్రకారం.

సందేశాత్మకంగా మెచ్చుకోదగినది "జై భీమ్" కానీ సైద్ధాంతిక పరంగా కొన్ని అపోహలు కలిగించాడు దర్శకుడు.

ప్రతిసారి విప్లవం సమానత్వం సమాన న్యాయం కోసం కాదు...
ప్రతిసారి బుద్ధం శరణం గచ్చామి పనికిరానిది...

 హరి ప్రసాద్✍🏻

Comments

Popular posts from this blog

The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴