𝗔𝗹𝗶𝗲𝗻𝘀 𝗮𝗿𝗲 𝘄𝗮𝘁𝗰𝗵𝗶𝗻𝗴 𝗼𝘂𝗿 𝗵𝗶𝘀𝘁𝗼𝗿𝘆 !
గ్రహాంతర వాసులు మన చరిత్రను గమనిస్తున్నారా?
● మీరు ఎప్పుడైనా రాత్రి ఆకాశంలో చూస్తూ మన లాంటి మరో గ్రహం ఉందని అనుకున్నారా?
ఒకవేళ మన లాంటి గ్రహం ఉంటే ఆ గ్రహం మీద జీవం ఉందని అనుకుంటున్నారా?
అసలు గ్రహాంతర వాసులు ఉన్నారని అనుకుంటారా?
ఇది నిజంగా ఊహకందని ఒక విచిత్రం, ఈ విషయం పక్కన పెట్టి నిజంగా మన లాంటి గ్రహంతరవాసులు ఉందాం అని అనుకుందాం ఎందుకంటే?
ఈ విశ్వం మొత్తం ఒక కోటి సూపర్ క్లస్టర్ తో నిండి ఉన్నది అందులో ఎన్నో గెలాక్సీ క్లస్టర్ ఉన్నాయి ఆ గెలాక్సీ క్లస్టర్ లో మళ్ళీ కొన్ని వేలల్లో గెలాక్సీలు ఉన్నాయి ఒక్కో గెలాక్సీల లో 500 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి ఒక్కో నక్షత్రం ఒక్కో సూరీడు కింద లెక్క వేసుకుంటే అలా అన్నీ నక్షత్రాలతో కలిసి ఉన్న గ్రహాల లెక్క సుమారు కొన్ని ట్రిలియన్ల గ్రహాలు అనుకోవచ్చు మరి ఇంత పెద్ద విశ్వంలో గ్రహాంతర వాసులు లేరు అని ఎలా అనుకుంటారు?
నిజంగా ఈ విశ్వంలో మానవ నాగరికత మాత్రమే ఉంది అనుకోవటం తప్పు...
ఇక్కడ మనకు ఒక ప్రశ్న కలగడం సహజం ఒకవేళ గ్రహాంతరవాసులునాగరికత ఉంటే మనం గ్రహాంతరవాసులతో ఎలా మాట్లాడగలం? గ్రహాంతర వాసులకు మానవ భాష అర్థం కాదు అలాగే మనకు వాళ్ల జీవ ప్రక్రియల గురించి కూడా తెలియదు తెలుసుకునే అవకాశం కూడా చాలా తక్కువ వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు ఎప్పటికీ తెలుసుకోలేము గ్రహాంతరవాసుల యొక్క నాగరికత వాళ్ళ ఆలోచించే విధానం వాళ్ల భౌతిక స్థితిగతులు ఇలా చాలా విషయాలు ఎప్పటికీ తెలుసుకోలేము ఇంకా వాళ్ల ఆహారపు అలవాట్లు వాళ్లు సూక్ష్మ ప్రపంచం (Microscopic గా) లో నివసిస్తున్నరా? లేక మనకన్నా బలమైన వాళ్ల? ఇవన్నీ ఊహించుకోవడం కష్టమే వీటి గురించి ఇంకా తెలియదు....
గ్రహాంతరవాసి ఉండి ఉంటే ఆదిమానవుడు లా ఉంటాడు అనుకోవడం పూర్తిగా అవాస్తవం అబద్ధం...
మన చుట్టూ ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద, ఆ జీవరాసులలో మనం మానవులం 0.01% శాతం కూడా మిగతా జీవుల తో పోలిస్తే లేము ఈ భూమి మీద అసలు రోజు చూసే ఎన్నో జీవుల తోనే మనం మాట్లాడలేము.
ఇప్పటిదాకా జంతువులతో సూటిగా మనం సంభాషించటం కూడా కుదరని పని అలాంటిది ఎక్కడో నివసిస్తున్న గ్రహాంతరవాసులతో మనం సంభాషించాలి అనుకోవడం ఎంత పెద్ద ఊహను మీకే వదిలేస్తున్నాను....
వీటన్నిటినీ మనం పరిగణనలోకి తీసుకుంటే అసలు మనం గ్రహాంతరవాసులతో సంభాషించడం కుదురుతుందా అనేది ఒక అంతుచిక్కని ప్రశ్న ?
ఇక మీ అందరికీ ఒక వింతైన విషయాన్ని తెలియజేస్తాను!
గ్రహంతరవాసులు ఇప్పుడు ఈ క్షణం వాళ్ల దగ్గర ఒక Telescope గనుక ఉంటే వాళ్లు మన భూమి వైపు చూస్తూ ఉంటే వాళ్లు మమ్మల్ని గమనించలేరు మన చరిత్రను గమనిస్తూ ఉన్నారు అనుకోవాలి ఎలాగో వివరిస్తాను...
నిజమే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని గమనిస్తున్నప్పటికీ ఇప్పుడున్న మానవ స్థితిగతులు వాళ్లకు కనిపించవు కాకపోతే, మన చరిత్ర కనిపిస్తుంది మీరు విన్నది సత్యం అది ఎలాగో వినండి...
ఈ విషయం మనకు బాగా అర్థం అవ్వాలి అంటే విశ్వంలో దూరాన్ని మనం Meters లేద Kilometres తో కొలవలేము, మరి దేనితో కొలుస్తారు అంటే ? "కాంతి వేగం" తో
కాంతి మూడు లక్షల కిలోమీటర్లు ప్రతి క్షణంలో అంటే ప్రతి ఒక్క సెకండ్ లో కాంతి సుమారుగా మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది
Light Speed = 300000 Km/Sec
ఈ లెక్కన మనం చూసుకుంటే రోజుకు మనకు 24 గంటల్లో 1440 నిమిషాలు ఉంటుంది అందులో మళ్ళీ 86400 సెకండ్లు కలిగి ఉంటుంది ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటే రోజుకు 86400 Seconds కలిగి ఉంటే అప్పుడు,
సంవత్సరానికి సుమారు గా
86400×365 = 31536000 Seconds కలిగి ఉంటుంది దాదాపు మూడు కోట్ల పదిహేను లక్షల 36 వేల సెకండ్లు ఉంటుంది...
కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణించగలదు దానినే మనం ఒక కాంతి సంవత్సరం గా పరిగణించాలి అంటే దాదాపు 3 కోట్ల పదిహేను లక్షల 36 వేల సెకండ్లలో కాంతి
9 ట్రిలియన్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే దాదాపు
(ఒక ట్రిలియన్ ఒక లక్ష కోట్ల తో సమానం)
One Light Year = 9 Trillion Kilometres or 9 Lakhs of Crores Kilometres
అంటే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఒక సంవత్సరంలో కాంతి.......
దీనినే మనం ఒక కాంతి సంవత్సరా దూరం అని అనుకోవచ్చు ( One Light Year )
ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం...
సూర్యుడు ఉపరితలం నుంచి కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది అంటే కాంతి సూర్యుడి ఉపరితలం నుంచి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల ప్రయాణించి భూమికి చేరటానికి ఎనిమిది నిమిషాలు సమయం తీసుకుంటుంది దీని ప్రకారం గా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కాంతి సూర్యుడి ఉపరితలం మీద ఎనిమిది నిమిషాల క్రితమే ఏర్పడి ఉంటుంది...
ఒక టెలిస్కోప్ తీసుకుని సూర్యుడి ఉపరితలం గనక మనం గమనిస్తే అక్కడ సంభవించే భౌతిక ప్రక్రియలన్నీ 8 నిమిషాల క్రితం జరిగినది ఇప్పుడు చూస్తున్నాము అని అర్థం....
ఈ లెక్కన,
మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రం అంటే ఇంకో సూర్యుడు అనుకోవచ్చు దాని పేరు
Proxima Centauri నక్షత్రం ఇది దాదాపు మన భూమి నుంచి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంటే మనం ఇప్పుడు ఒక టెలిస్కోప్ తీసుకొని ఆ నక్షత్రాన్ని చూస్తే ఆ నక్షత్రం మీద జరిగే భౌతిక ప్రక్రియను మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటే ఆ ప్రక్రియ సుమారుగా 4.2 సంవత్సరాల క్రితమే జరిగి ఉంటుంది.
ఇంకా కొంచెం లోతుగా విశ్లేషించి చెప్తాను మీకు అర్థం అవ్వటానికి....
మీ చేతిలో ఒక అత్యాధునికమైన టెలిస్కోపు ఉంది అనుకోండి ఆ టెలిస్కోప్ తో మీరు పైన చెప్పబడిన నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారు
ఆ నక్షత్రం చుట్టూ ఒక గ్రహం ఉంది అనుకోండి ఆ గ్రహం మీద ఇద్దరు గ్రహాంతరవాసుల మధ్య సంభాషణ జరుగుతుంది అది ఇప్పుడు మీరు ఈ క్షణం మీ చేతిలో ఉన్న టెలిస్కోప్ ద్వారా చూస్తూ ఉన్నారు ఈ సంభాషణ ఇప్పుడు జరుగుతుంది అని మీరు అనుకుంటారు కానీ అక్కడినుంచి కాంతి మన భూమికి చేరడానికి 4.2 కాంతి సంవత్సరాలు సమయం తీసుకుంటుంది అని చెప్పాను అంటే దాదాపు అక్కడి నుంచి ఇక్కడ కాంతి చేరడానికి 4.2 సంవత్సరాల కాలం పడుతుంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వారి సంభాషణ ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం జరిగినది... అంటే , ఇప్పుడు మీరు చూస్తున్నది వాళ్ళు యొక్క ప్రస్తుత స్థితిగతులు కాదు నాలుగు సంవత్సరాలు జరిగిపోయినటువంటి చరిత్రను మీరు చూస్తున్నారు....
ఒకవేళ అక్కడ ఉన్న గ్రహంతరవాసులు మమ్మల్ని చూస్తూ ఉంటే వాళ్ళు ప్రస్తుత స్థితి గతులు చూడలేరు నాలుగు సంవత్సరాల క్రితమే జరిగిపోయినట్టు వంటి మన చరిత్రను వాళ్లు చూస్తూ ఉన్నారు అని అర్థం....
ఈ ఈ విధంగా ఇలాంటి ఉదాహరణగానే
Andromeda Galaxy
లో ఉన్న గ్రహాంతరవాసులు ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్లు మన మొదటి ఆది మానవుడు యొక్క చరిత్రను చూస్తున్నారు అని అర్థం అంటే దాదాపు మూడు లక్షల సంవత్సరాల క్రితం చరిత్రను చూస్తున్నారు అని అర్థం అ గ్యాలక్సీ నుంచి మనభూమికి మూడు లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అందుకే వాళ్లు మూడు లక్షల సంవత్సరాలు వెనక్కి జరిగి నటువంటి స్థితిగతులు చూడగలుగుతారు...
అలాగే ఇంకో గ్యాలక్సీ ఉంది అనుకుందాం
మన భూమి నుంచి ఆ గ్యాలక్సీ దూరం సుమారు 80 కాంతి సంవత్సరాల దూరం ఉంది అని అనుకుంటే వాళ్లు ఇప్పుడు మన ప్రస్తుత స్థితి గతులను కాకుండా రెండవ ప్రపంచ యుద్ధం చేస్తున్నట్లు లెక్క
2022 ౼ 80 = 1942 సంవత్సరం అన్నమాట
ఇంకో ఉదాహరణ తీసుకుంటే ఇంకో గ్యాలక్సీ ఉంది అనుకుందాం అ గ్యాలక్సీ నుంచి మన భూమి దూరం 650 లక్షల కాంతి సంవత్సరాల దూరం అనుకుంటే అక్కడున్న గ్రహంతరవాసులు ఒక టెలిస్కోప్ తో ఇప్పుడు గనుక చూస్తూ ఉంటే వాళ్ళకి మనం ఇప్పుడు కనిపించము మన భూమి మీద ఎప్పుడూ 650 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన డైనోసార్ల వాళ్ళు చూస్తున్నారు అని అర్థం....
ఇంకా ఇలాంటి కథలు వివరిస్తూ ఉంటానని
మీ హరి ప్రసాద్ 🖊️
Comments
Post a Comment