𝗔𝗻𝗰𝗶𝗲𝗻𝘁 𝘂𝗻𝗰𝗲𝗿𝘁𝗮𝗶𝗻 𝗽𝗲𝗿𝗽𝗹𝗲𝘅𝗶𝘁𝗶𝗲𝘀 𝗮𝗻𝗱 𝗽𝗵𝗶𝗹𝗼𝘀𝗼𝗽𝗵𝗶𝗰𝗮𝗹 𝗱𝗲𝗯𝗮𝘁𝗲𝘀 𝘁𝗵𝗮𝘁 𝘁𝗼𝗼𝗸 𝗽𝗹𝗮𝗰𝗲 𝗮𝗿𝗼𝘂𝗻𝗱 𝗦𝗿𝗶𝗻𝗶𝘃𝗮𝘀𝗮 𝗠𝘂𝗹𝗮𝘃𝗶𝗿𝗮𝘁𝗵 - 𝗧𝗶𝗿𝘂𝗺𝗮𝗹𝗮

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వెలసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది, శేషాచలం అడవుల మధ్యన కలియుగ అవతారం రూపంలో సాక్షాత్తు ఆ హరి నారాయణుడు శ్రీమహావిష్ణువే స్వయంభువుగా వెలసిన దివ్యమైన స్వయంభు శాలిగ్రహ విగ్రహ రూపంలో సాక్షాత్ మహావిష్ణువు ని దర్శించుకోవచ్చు ఇక్కడ.

తిరుమల యొక్క చరిత్ర దాదాపుగా తమిళ సాహిత్యంలోనే లభిస్తుంది ప్రాచీన కాలంలో తిరుమలకు మరో పేరు తిరువేంగడం అని పిలిచేవారు  దీని అర్థం తమిళదేశానికి ఉత్తర భాగంలో కొండ ప్రాంతం అని అర్థం. తమిళంలో తిరు అంటే తెలుగులో 
" శ్రీ " అని అర్థం అందుకే ఇక్కడ వెలసిన దేవుడు కి 
"తిరు-వేంగడవీడయవర్"  అని అంటారు తెలుగులో 
"శ్రీ వేంకటేశ్వరుడు" అని అర్థం.

 ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన చారిత్రక పరమైన విషయాలు చర్చిస్తాను ముఖ్యముగా స్వామి వారి మూలవిరాట్ కు సంబంధించిన విషయాలుతిరుమల యొక్క చరిత్రను మనం దాదాపు శిలాశాసనల వాటి ద్వారా నే తెలుస్తుంది అందులో ముఖ్యముగా 
సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి పరిశోధనలు చేసి దాదాపు తిరుమలలో లభించే 90% శిలాశాసనలు అనువదించి భక్తులందరికీ చరిత్ర తెలిసేలా కృషి చేశారు. 
ఆ తర్వాత రమేష్ గారు కూడా కొంతమేరకు పరిశోధన చేసి శిలాశాసనాల లో దాగి ఉన్న విషయాలు తెలిసేలా చేశారు.

స్వామివారి మూలవిరాట్ దాదాపు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నుంచి పూజలందుకోవడం అనే విషయం చారిత్రక విషయాలలో నుంచి మనం తెలుసుకోవచ్చు.
 శేషాచల తిరుమల కొండను ఎంతో మంది రాజులు పరిపాలించారు ముఖ్యముగా ఇక్కడ లభించే అన్ని శిలాశాసనలు తమిళం లోనే ఉన్నాయి కొన్ని తెలుగు మరియు కన్నడ లో కూడా చూడవచ్చు ముఖ్యముగా మరాఠా సామ్రాజ్య కాలంలో ఇక్కడ మరాఠీ లిపి కి చెందిన శాసనాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.

ఒక గొప్ప విషయం ఏమంటే విజయనగర రాజుల కాలంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో అన్ని భాషలకు సంబంధించిన శిలాశాసనలు గమనించవచ్చు Linguistic Equality నీ ఈయన సమర్థించాడు.

తిరుమల ను ఎంతోమంది రాజులు, ఎన్నో రాజ్యాలు పరిపాలించాయి కొండకు వస్తురూపేనా రూపంలో బంగారం వజ్రవైఢూర్యాలు కూడా సమర్పించారు‌.

గర్భగుడిలో స్వామివారికి మూలవిరాట్ పక్కనే భోగ శ్రీనివాసుడు యొక్క విగ్రహం పాండ్యన్ రాజ్యానికి చెందిన  "సమైక్య" అని మహారాణి బహుకరించారు.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దాదాపు క్రీస్తు శకం 11 & 12వ శతాబ్దం దాకా తిరుమల లో ఏ దేవుడు వెలిశాడని? అన్న ప్రశ్న కు సమాధానం లేదు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తిరుమలలో బలిపీఠం దగ్గర ఒకప్పుడు బలిదానాలు కూడా జరిగేవి
 వీటికి అసలు కారణం కలియుగ రూపంలో వెలసిన వెంకటేశ్వరుడి యొక్క చరిత్ర హిందూ పురాణాలలో ఎక్కడ కనిపించకపోవడం ఆ తర్వాత ఈ గుడికి సంబంధించిన విషయం కేవలం ఒక చారిత్రక 
వెంకటేష - ఇతిహాసములో మాత్రమే లభించటం.

తిరుమలలో వెలసినది ఏ దేవుడు అన్న ప్రశ్నకు అప్పటి కాలంలో ఎన్నో సందేహాలకు దారి తీసింది.

1) శివుని కుమారుడైన కార్తికేయ సుబ్రహ్మణ్యస్వామి  తారకాసురుని (రాక్షసుడు) వధించిన తరువాత శేషాచలం అడవుల్లో ఆయన విచ్చేసి అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసి ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల దేవాలయం పక్కన పుష్కరిణి అనే ఒక నీటి కోనలో స్నానం చేసి కొన్ని సంవత్సరాలు అక్కడే గడిపారని స్కాంద పురాణం వివరిస్తుంది.
ఈ ప్రమాణాన్ని తీసుకొని శైవులు ఇక్కడ వెలసినది సుబ్రహ్మణ్యస్వామి అని చెప్పుకున్నారు ముఖ్యంగా ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ఆయుధాలను వదిలి తపస్సు చేశారని స్కాంద పురాణం వివరిస్తుంది 
కాబట్టి మొదటిగా ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి గా పేర్కొన్నారు.

2) ఇక రెండవ కోణంలో స్వామి వారి మూల విరాట్ పద్మ పీఠం మీద వెలసినది అంటే స్వామి వారు పద్మ పీఠం మీద నిలుచున్నారు
 శ్రీ మహావిష్ణువు పద్మ పుష్పం పై వెలసి ఉన్నాడు అని చెప్పడానికి ఏ పురాణాలలో కూడా ప్రమాణం లభించలేదు కాబట్టి పద్మ పీఠంపై కేవలం బ్రహ్మదేవుడు వెలసి ఉంటాడు కాబట్టి ఇక్కడ వెలసినది బ్రహ్మదేవుడు అని మరొక వర్గం చెప్పుకొచ్చింది.

3) ఇక మూడవ వర్గం జైన మతానికి చెందిన జైన తాత్వికులు కొంతమంది  ఇక్కడ వెలిసినది జైన మతానికి చెందిన తీర్థతకారులలో రెండవ తీర్థతకరుడు "నేమీనాథుడు" అని చెప్పుకొచ్చారు దీనికి బలమైన ప్రమాణం ఏంటంటే నేటి తమిళనాడు పోలూరు ప్రాంతంలో ప్రాచీన జైనమతానికి చెందిన తిరుమలై అనే ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో వెలిసినది "నేమీనాథుడే" తిరుమలై అనే పేరు తిరుమల కు దగ్గరగా ఉండడంతో తో ఇక్కడ వెలిసినది "నేమీనాథుడే" అని చెప్పుకొచ్చారు.

4) ఇక 4వ వర్గం గుడికి సింహ ద్వారలు కలిగి ఉన్నందున ఖచ్చితంగా ఇది విష్ణుమూర్తి ఆలయం మాత్రం కాదు సింహ ద్వారాలు ఉన్నాయి గనుక ఇది ఖచ్చితంగా శక్తి దేవి స్వరూపం అయి ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు.

5) ఐదవ వర్గంవారు విష్ణు ఆలయంలో వైష్ణవ అర్చకులు బిల్వ పత్రి తో విష్ణు పూజ చేయరు.
ఇక్కడ మాత్రం దీనికి మినహాయింపుగా ప్రతి శుక్రవారం స్వామికి తులసి బిల్వ పూజ జరగటం వలన అవి శివుడికి ప్రీతం అయినది కనుక ఇక్కడ వెలిసిన శివుడు అని చెప్పుకొచ్చారు.

6) ఇక ఆరవ వర్గం వారు ఈ ఆధునిక కాలంలో నే మరో ప్రచారం చేశారు భారతదేశంలో హైందవ ఆలయాలలో ఎక్కడ కూడా కేశ అర్పణ జరగదు.
కానీ ఇక్కడ భక్తులు తమ కేశాలను దేవుడికి అర్పిస్తూ ఉంటారు ఇది కేవలం ఒక బౌద్ధం లోనే జరుగుతుంది అది కూడా సన్యాసం తీసుకోనే ప్రక్రియలలో అలాగే ఈ ప్రదేశానికి  బౌద్ధ ఇతిహాసాలకు కొన్ని పోలికలు ఉన్నాయని పరిశోధనల్లో తెలియడం వలన ఇక్కడ వెలసినది బుద్ధుడు అని చెప్పుకొచ్చారు.
( Read - Tirupati Balaji was a Buddhist Shrine by "Jamanadas K" )



ఇలాంటి వాదాలతో తిరుమలలో 
ఏ దేవుడు ఉన్నాడో? తెలియక పన్నెండవ శతాబ్దం దాకా కేవలం పూజలు జరుగుతూ వచ్చాయి.

ఏ దేవుడు అన్న ప్రశ్నలకు మరియు వీటన్నిటికీ సమాధానంగా విశిష్ట అద్వైత తత్వాన్ని స్థాపించిన రామానుజులు సమాధానాలు సంధించారు.

మొదటి వాదానికి ఇక్కడ ఉన్నది సుబ్రహ్మణ్యస్వామి రూపం కాదు అని చెప్పారు ఇక్కడ కేవలం సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని వధించి తర్వాత బ్రహ్మహత్య జరిగినందుకు శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం తపస్సు కోసం విచ్చేశారు తప్ప ఆయన శిలారూపంలో ఇక్కడ వెలసినది కాదు అని చెప్పారు.
తపస్సు తో పాటు ఇక్కడ
 శ్రీ వేంకటేశ్వరుడి ఆశీర్వాదము కొరకు విచ్చేశారు అని పురాణ ఇతిహాస ప్రకారంగా నిరూపించారు.

ఇక ఇక్కడ ఉన్నది శివుడు మరియు బ్రహ్మ కూడా కాదు ఎందుకంటే భృగు మహర్షి శాపం వలన బ్రహ్మకు బ్రహ్మ పూజ జరగదు కాబట్టి ఇక్కడ బ్రహ్మ కాదు తరువాత శివుడికి లింగ పూజ జరుగుతుంది తప్ప శిలా - శిల్ప పూజ జరగదు కాబట్టి ఇక్కడ శివుడు కూడా కాదు. కాకపోతే, భీల్వ  పూజ ఎందుకు జరుగుతుందనే ప్రశ్నకు 
శ్రీనివాసుడీ వక్ష స్థలంలో లక్ష్మీదేవి నివసించడం ద్వారా ప్రతి శుక్రవారం తులసి భీల్వ పూజ లక్ష్మీదేవికి సమర్పిస్తారు తప్ప శ్రీనివాసుడికి కాదు అన్న విషయం చెప్పువచ్చారు. 

ఇక మిగిలిన వాదనల గురించి ప్రస్తావిస్తే ఇది కచ్చితంగా పురుష దైవమే కాబట్టి శక్తి దేవి మాత్రం కాదు అని అలాగే హైందవ దేవుడిగా ఎంతో కచ్చితంగా కనిపిస్తూ ఉండడం వలన బుద్ధుడు మరియు నేమీనాథుడు కూడా కాదు అని చెప్పుకొచ్చారు.


ఇలాంటి వాదనలు కలగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ? విష్ణుమూర్తి ప్రీతి అయినటువంటి శంఖచక్రాలు విగ్రహానికి శిల్ప రూపంలో కలిగి ఉండకపోవడం.
 ఇది ఎందువలన అంటే? శ్రీనివాసుడు అలివేలు మంగమ్మ పెళ్లాడిన తర్వాత తన శంఖచక్రాలు తన బావకు అర్పిస్తాడు, అందువలన ఇక్కడ మూలవిరాట్టుకు శిల్ప రూపంలో శంఖ చక్రాలను గమనించలేము‌ 
(తర్వాతి కాలంలో బంగారు నేపథ్యంతో శంఖ చక్రాలను స్థిరపరిచారు)
అలాగే విష్ణుమూర్తి సంబంధించిన రూపాలలో దశావతారాలు గా చెప్పుకుంటారు కానీ నిజానికి విష్ణుమూర్తి యొక్క రూపాలు 24 అందులో ఎక్కడా కూడా వెంకటేశ్వరుడి రూపం కనిపించదు అంతటితో కాకుండా శ్రీవేంకటేశ్వరుడు యొక్క చారిత్రక విషయాలు ఇతిహాసాలలో కానీ పురాణాలలో గాని కనిపించకపోవడం ఇలాంటి సందేహాలు కలిగాయి.


వీటన్నిటికీ సమాధానంగా శ్రీరామానుజులు గారు వేదాలను చదివి పురాణాలను క్షుణ్ణంగా పరిశీలించి వెంకటేష - ఇతిహాసం కూడా ఒక పురాణం గానే సంబోధిస్తూ ఈ వాదనలను సమాధానాలు గా వివరించారు 
కొన్ని పురాణాలలో వెంకటేశ్వరుడి ప్రస్తావనను కూడా జరిగినది దానిని సరైన అవగాహనతో విజ్ఞానంతో పసిగట్టి రామానుజులవారు ప్రతిపాదించారు. 

శ్రీ వేంకటేశ్వరుడు అప్రాకృత రూపమైన తిరుమల మూలవిరాట్ కచ్చితంగా విష్ణు అవతారం అందులో ఎటువంటి సందేహం లేదు జ్ఞాన దృష్టితో మనం పురాణాలనుంచి వేదాలనుంచి పరిశీలిస్తే మనకు శ్రీనివాసుడు ప్రతి చోటు కనిపిస్తూనే ఉంటాడు.



ఆ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో 🙏🏻

మీ హరి ప్రసాద్ 🖊️

Comments

Popular posts from this blog

The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴