వెంగళపురం ఆంజనేయస్వామి దేవాలయం (ప్రాచీన వెంగళపురం చరిత్ర) - ఆదోని
=======================
● 17th Century AD పదిహేను వ శతాబ్దంలో ఆదోని విజయనగర రాజ్యంలో కలిసి ఉంది అప్పటి రాజు శ్రీకృష్ణదేవరాయలు తన అల్లుడు అయినా తిరుమలరాయుడి కి ఆదోని యొక్క ఆస్థాన రాజు గా పేర్కొన్నాడు... తిరుమలరాయుడు శ్రీకృష్ణదేవరాయ రెండవ కుమార్తె అయిన వెంగలమాంబ కు వివాహం చేసుకున్నాడు... తన భార్య పేరు మీద ఒక సుందరమైన చిన్న గ్రామం కట్టించాలి అనుకున్నాడు తిరుమలరాయుడు... ఒక సుందరమైన గ్రామాన్ని కట్టించి దానికి వేంగలపురం అని పేరు పెట్టాడు... ఈ గ్రామం ఒక పెద్ద కోట గోడ ఎదురుగా నిర్మించాడు... అయితే, రాను రాను ఇదంతా శిథిలమై కనుమరుగైపోయింది...ఈ వేంగలపురం గ్రామం ఇవాల్టి షరీఫ్ బజార్ గా పిలవబడుతుంది.
ఆనాటి కాలంలోనే విజయనగర రాజ్యం లో వ్యాసరాయలు
(వేదాంత ద్వైత సిద్ధాంతాన్ని బలపరిచారు) ఈయన ఆదోని ప్రాంతమంతా తిరిగి ఎన్నో ఆంజనేయ స్వామి దేవాలయాలను ప్రతిష్టించారు అందులో ఒకటి ఈ వెంగళపురం ఆంజనేయస్వామి దేవాలయం షరీఫ్ బజార్ నందు కలదు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ దేవాలయం, శ్రీ వ్యాస రాయల మరో జన్మనే శ్రీ రాఘవేంద్ర స్వామి(మంత్రాలయం పుణ్యక్షేత్రం)
Comments
Post a Comment