శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మరియు ఆదోని ఆస్థాన రాజు అయినటువంటి సిద్ధి మసూద్ ఖాన్ మధ్య జరిగిన సంఘటన - ఆదోని
|| శ్రీ గురు రాఘవేంద్ర మరియు ఆదోని నవాబ్ ||
● ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ తన భార్యలతో కలిసి ఉన్న సమయంలో, తన మంత్రి అయినా, "దివాన్ వెంకన్న" ఇలా చెప్పసాగాడు మిమ్మల్ని కలవడానికి దేవుని అంశ అయినా ఒక గురువు మరియు మహనీయుడు వచ్చారు అని చెప్పసాగాడు.
"దేవుని అంశ అయినా మహానీయుడు వచ్చాడా అని సిద్దిమసుద్ ఖాన్ చెప్పాడు."
"మహమ్మద్ పైగంబర్ వచ్చారా?"
అప్పుడు వెంకన్న
"లేదు, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి." అన్నాడు.
“హా, హా, హా! సాధువులందరూ గొప్పవారు కారు. ఎలాగైనా అతనికి ఏదైనా ఇచ్చి పంపించి వేయండి.” - అని అన్నాడు
అప్పుడు దివాన్ ఇలా చెప్పాడు, ఆయన సాధారణ మానవుడు కాదు అతను చాలా మందిని వారి కష్టాల నుండి విముక్తి చేసాడు - “మీరు ఒకసారి ఆయనను చూసి ఆయన ఆశీస్సులు పొందాలి అని నేను దానిని గట్టిగా కోరుతున్నాను అంతే అని అన్నాడు" వెంకన్న
“మీరు హిందువులు త్వరగా అందరినీ నమ్ముతారు, ఏది ఏమైనా రేపు ఆయనతో మాట్లాడడానికి ఏర్పాటు చేయండి నేను అతని శక్తిని పరీక్షిస్తాను - అని నవాబు అయినా సిద్ధిమషద్ ఖాన్ అన్నాడు.
మరుసటి రోజు నవాబు శ్రీ రాఘవేంద్రునికి నమస్కరిస్తూ కలవటానికి వచ్చాడు.
“నారాయణా! మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది” అన్నాడు సాధువు గురు రాఘవేంద్ర స్వామి.
అప్పుడు నవాబు గురు రాఘవేంద్రుడితో బహుమతిని స్వీకరిస్తారా అని చేప్పసాగాడు అప్పుడు శ్రీ రాఘవేంద్రుడు "శ్రీరాముడు భక్తితో ఏది ఇచ్చినా స్వీకరిస్తాను" అని అన్నాడు.
నవాబు ఒక సేవకుడుని పిలిచి ఒక పట్టు గుడ్డతో కప్పబడిన మాంసపు పళ్లెంని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ముందు ఉంచాడు.
శ్రీ రాఘవేంద్రుడు నవాబు వైపు తిరిగి చూస్తూ ఉండగా “దయచేసి మీరు ప్రేమతో సమర్పించిన కానుకను దాచవద్దు గుడ్డ తీసివేయండి అని చెప్పేసాగాడు" అప్పుడు నవాబు ముందుకొచ్చి పళ్లెంలో ఉన్న మాంసపు ముక్కల పై ఉన్న గుడ్డను తీశాడు అది చూసి శ్రీ రాఘవేంద్రుని అనుచరులు ఆశ్చర్యపోయారు అది చూసిన సాధువు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చలించలేదు.
అతను ప్రశాంతంగా పళ్ళెం మీద కొంచెం నీళ్ళు చల్లాడు. పళ్ళెంలో ఉన్న మాంసపు ముక్కలు ఒక్కసారిగా పూలు మరియు పండ్లుగా మారిపోయాయి అది చూసి ఆ గదిలో ఉన్న అందరూ నవబు అనుచరులతో సహా ఆశ్చర్యపోయారు.
“చూశావా నవాబ్? మనం దేవుణ్ణి ఎలా గౌరవించాలో మన ఇద్దరి కంటే మరియు అందరి కంటే దేవుడు గొప్పవాడు ఆయనకు అన్నీ తెలుసు. మనం తప్పు చేసినప్పుడల్లా ఆయన మనల్ని సరిదిద్దుతూనే ఉంటాడు, కాదా?” అని చెప్పాడు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి.
దానితో నవాబు క్షమించమని వేడుకున్నాడు. “దయచేసి నన్ను శిక్షించండి స్వామీజీ,అలాగే నన్ను క్షమించమని దేవుడిని అడగండి అని వేడుకో సాగాడు.
ఆదోని నవాబుతో శ్రీ రాఘవేంద్ర స్వామి చూపించిన ఒక మహిమ ఇది - ఆదోని చరిత్రలోనే ఒక గొప్ప సంఘటన.
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి తను జీవ సమాధి కావటానికి నవాబు దగ్గర మంత్రాలయ పుణ్యక్షేత్రమునందు స్థలాన్ని అడగటానికి వచ్చిన సంఘటన ఇది.
నవాబు మంత్రి అయిన వెంకన్న ఎంతో దయానియుడు ఒకసారి ఆదోని ప్రాంతంలో కరువు సంభవిస్తే ఒక పెద్ద బావి కట్టించాలని వెంకన్న నిర్ణయించి సిద్ధి మసూద్ ఖాన్ యొక్క ఆస్థాన అనుచరులతో అనుమతి తీసుకుని ఒక పెద్ద బావిని నిర్మించాడు ఆ బావే ఇవాళ్ళ మనం చెప్పుకుంటున్న వెంకన్న బావి.
----
హరి ప్రసాద్ 🖊️🌹
Comments
Post a Comment