|| స్వాకుళ-సాళియుల దైవం శ్రీ జీహ్వేశ్వరుడి ఇతిహాస వర్ణన ||

స్వకుల వాణి సంచికలో ప్రచురించబడిన వాక్యము నుండి తీసుకొనడం జరిగినది


స్వకుల సాళీ మూల పురుషుడైన శ్రీ జిహ్వేశ్వరుడి ఇతిహాసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వెనుకబడిన వర్గానికి చెందిన స్వాకుళ-సాళియుల సమాజ బంధువులకు ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ శుద్ధ త్రయోదశి రోజు పండుగ రోజు, ఆ రోజు వారి మూలపురుషుడైన శ్రీ జీహ్వేశ్వరుని జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటారు. 

వీరి ముఖ్య వృత్తి చేనేత అంటే మగ్గం వెయ్యడం
మన రాష్ట్రంలో ముఖ్యంగా వీరు ఆదోని, యాడికి, కర్నూలు, ఎమ్మిగనూరు, మహబూబ్నగర్, రాజోలి, గుంతకల్, ఆత్మకూర్, కడప, అదిలాబాద్, ఉరవకొండ, నంద్యాల, ప్రొద్దుటూరు, చిత్తూరు, నారాయణపేట, గద్వాల్, హైదరాబాద్, అనంతపూర్, ధర్మవరం, తాడిపత్రి, మరియు రాయదుర్గం తదితర ప్రాంతాలలో వివిధ వృత్తులను చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు.

ఆత్రి మహర్షి రచించిన స్కంద పురాణంలోని కాశి ఖండంలో కాలభైరవుని వర్ణన చేయబడినది, అందులో కాశీలో నెలకొన్న కాలభైరవుడే శ్రీ జిహ్వేశ్వరుడని ఆ గ్రంథంలో పేర్కొనబడినది.

ఈశ్వరుడు తన జీవము(నాలుక) నుండి ఒక బాలుడు ఉద్భవించేటట్టు చేస్తాడు ఆ బాలుడు ఆదిమాయ వద్దకు తీసుకెళ్లగా సర్వులకు వస్త్రాలు నిర్మాణము చేయు బాలుడు అని అందుకే సాళీ అని పేరు పెట్టమని చెప్పింది. స్వకుల సాళి అంటే అందరికీ వస్త్రాలను అందించేవారు అని అర్థం.

ఈశ్వరుడు ఇలా చెప్పేసాగాడు సర్వ కులముల వారికి వస్త్రములు కూర్చగల ఈ బాలునికి స్వకుళ సాళి అని పేరు పెట్టెదము అని చెప్పాడు, అప్పుడు పార్వతీదేవి ఆ బాలుడిని చూచి ఈశ్వరుడు జీహ్యం(నలుక) నుండి జన్మించినవాడు గనుక స్వకుల సాళీ జీహేశ్వర అని నామకరణం చేసింది.

 శ్రీ జీహ్వేశ్వరుడు శ్రావణ శుద్ధ త్రయోదశి సోమవారం సూర్యోదయమున జన్మించెను, ఆ బ్రహ్మదేవుడు వంశమే ఇతని వంశము కనుక సూర్యవంశం అని గోత్ర నిర్ణయము సమకూర్చినారు. 

ఆ బాలుడే పెరిగి పెద్దవాడై వస్త్రములు తయారు చేశాడని ఈ గ్రంథంలో చెప్పబడింది అలాగే దినదినానికి పెరిగి పెద్దవాడైన శ్రీ జివేశ్వరులకు అంకినీ, దశంకినీలతో వివాహము జరిగినది అంకినీ గర్భంలో నలుగురు పుత్రులు దశంకిని గర్భంలో ఆరుగురు పుత్రులు జన్మించారు.

ఇక సుకర్ముడు అనే పండితుడు జివేశ్వరుమునకు వేదములు నేర్పక నానాదూర్భాషలాడి మహా-బలుడు అనే రాక్షసుని వద్దకు వెళ్లి చెయ్యి కలుపుతాడు, ఆ తర్వాత జిహ్వేశ్వరుడు అతనిపై దండెత్తి అతనిని సంహరిస్తాడు.


పార్వతి పరమేశ్వరులు కాశీలో నెలగొన్నారని తెలిసిన జీహ్వేశ్వరుడు తాను కూడా కాశీలో నెలగొనాలని తన అభిప్రాయమును తెలుపగా శివుడు నీవు కాలభైరవుడై యుండును అని దీవిస్తాడు కాశీలో కాలభైరవుడై వెలగొన్న అతనే శ్రీ జిహ్వేశ్వరుడు.
'కాలా' అంటే అర్థం మరణం మరియు భవిష్యత్త-సమయం అని అర్థం, ఎవరైతే మరణం గురించి మరియు భవిష్యత్తులో జరిగే సంఘటనలు గురించి మనలో ఉన్న భయాన్ని తొలగిస్తారో ఆయనే కాలభైరవుడు.

కాశీలో వెలసిన కాలభైరవుడు ఈయనే జీహ్వేశ్వరుడి మరో రూపం

సమాజ బంధువులకు ఇది తెలియాల్సిన ముఖ్యమైన జిహ్యేశ్వరుడి ఇతిహాస కథ.


మీ హరి ప్రసాద్ కామళే
🖊️🌹

Comments

Popular posts from this blog

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗠𝗮𝗻𝗴𝗮𝗿𝗮𝘆𝗮 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗔𝗱𝗼𝗻𝗶

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴