9 CE - Rashtrakutas Rule Around Adoni & Their Historical Remanents

యాదవాని సంస్థానం 9వ శతాబ్దం రాష్ట్రకుటుల పరిపాలన విభాగం
----------------------------------------------------------
మనం రణ మండల కొండ వెళ్లే మార్గ మధ్యలో ఒక కొండ రాతిపై రాష్ట్రకుటుల కాలం నాటి జైన అవశేషాలు గమనించవచ్చు తొమ్మిదవ శతాబ్దం 9 CE ఆదోని రాష్ట్ర కుటులు పరిపాలనలో భాగముగా ఉండేది - ఆ కాలం నాటి రాష్ట్ర కుటుల అప్పటి రాజు అమోఘవర్ష పరిపాలన కొనసాగించేవాడు, ఆ సమకాలిన కాలంలో జైన తత్వానికి చెందిన ఎన్నో అవశేషాలు ఆదోని చుట్టు ప్రాంతాల్లో గమనించవచ్చు ఇక్కడ 24వ జైన తీర్థంతకారుడు మహావీరుడి శిల్పం రాతి కొండపై చూడవచ్చు అలాగే, అదే రాతికోండ పై రాష్ట్ర కుటుల చారిత్రక శిలాశాసనం కూడా చూడవచ్చు.

భారతదేశంలో అశోకుడు తర్వాత అంత సువిశాలంగా పరిపాలించినది రాష్ట్రకుటుల రాజు అయినటువంటి అమోఘవర్షనే అని చరిత్రకారులు కూడా చారిత్రక పుస్తకాలలో పొందుపరిచారు.

ఆదోనిలో జైనతత్వానికి చెందిన మరికొన్ని అవశేషాలను కూడా గమనించవచ్చు అందులో ముఖ్యముగా రణ మండల కొండ వైపు వెళ్లే మార్గమధ్యలో ఒక చారిత్రక జైన దేవాలయం కూడా గమనించవచ్చు, ఆ దేవాలయం పేరు 'ఆక్రమిత్ మందిర్' అంతేకాకుండా రణ మండల కొండ గిరిదుర్గం కోట వెనక భాగంలో జైన తత్వానికి చెందిన జైన గుహలు కూడా గమనించవచ్చు.

అంతేకాకుండా ఇస్వీ గ్రామంలో బసవేశ్వరుడి ఆలయంలో జైనమత అవశేషాలు గమనించవచ్చు అలాగే రాంజల చెరువుకి ఆనుకొని ఉన్న ఒక కొండపై కూడా రాష్ట్ర కుటుల కాలం నాటి చారిత్రక అవశేషాలు చూడవచ్చు.

https://medium.com/@hariprasad445/-2f905fc91560

పురావస్తు శాఖ 
( Archeological Department ) ఈ చారిత్రక అవశేషాలని కాపాడుకోవటానికి వారి శాఖలో కలుపుకొని వీటిని కనుమరుగవ్వకుండా సహాయపడాలి.

Hariprasad Kamale ✍️📸


Comments

Popular posts from this blog

The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴