The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation
నల్లగుట్ట పాండురంగ విఠలేశ్వరుడి నల్ల కొండ విశిష్టత - ఆదోని పొలిమేర
"Lord Vitthal revealed Himself in the form of a cobra within a sacred earthen mound, untouched and revered by time."
ఆదోని పొలిమేరలో వెలసిన ఇస్వీ గ్రామ దారిన వెలసిన నల్లగుట్ట పాండురంగ స్వామి దేవాలయం ఎంతో ప్రాచీనమైనది, చరిత్రత్మకమైనది, ప్రకృతి సహజ సిద్ధమైనది.
ఈ నల్లగుట్ట దేవాలయము వెనుక భాగమున సహజసిద్దంగా ఏర్పడిన పుట్టశిల గురించి మరియు
ప్రాచీన ప్రకృతి సంపద అలాగే భౌగోళ శాస్త్రీయ - వృక్ష శిలాజ విజ్ఞానం
( Geology and Paleobotany ) గురించి తెలుసుకుందాం
ముందు గా ఒకసారి ఈ దేవాలయం యొక్క శాస్త్రీయతను మరియు ఆధ్యాత్మిక విషయాలను చర్చిద్దాం
- ఇక్కడ మనం గమనిస్తే ఆదోని చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా నల్ల రాళ్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ నల్లగుట్ట గుహలనందు స్వయంభుగా శ్రీ పాండురంగ స్వామి వెలసి ఉన్నారు.
- నల్ల రాతి నల్లగొండ వెనక శాస్త్రీయ పరిజ్ఞానం మరియు Geological Explanation
ఈ కొండ దాదాపు 360 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని జియాలజిస్టులు పేర్కొన్నారు అయితే ఈ కొండలు నల్లగా ఉండడానికి కారణం తెలుసుకుందాం, వీటిని మనం
Lichens అని పిలుస్తాము కొన్ని మిలియన్ సంవత్సరాలు వరకు నీటి ప్రవాహానికి ప్రకృతి సహజ సిద్ధంగా ఈ కొండలు నల్లగా ఏర్పడ్డాయి అంతేకాకుండా ఈ నల్ల రాళ్లలో ఎన్నో వివిధ రకాల వృక్షజాతికి చెందిన అవశేషాలు కలిగి ఉంటాయి వాటిని మనం Alage and Fungal Partner ( Mycobiont ) and Algal Partner ( Phycobiont ) వీటినే మనం Paleo Botany అంటాము అంటే ఈ రాళ్ళల్లో ఎన్నో వివిధ వృక్ష జాతుల కు చెందిన అవశేషాలను గుర్తించవచ్చు ఇది చాలా అరుదు మరియు ఇలాంటి నల్ల కొండలు చాలా అరుదు అలాగే శాస్త్రీయ పరంగా ఎంతో సహజ సిద్ధమైనది ప్రకృతి లో ఒక అమ్యులమైన వృక్ష సంపదకు సంతతి.
ఇంత విశిష్టత ఉందని మన వాళ్ళల్లో చాలా మందికి కూడా తెలిసి ఉండదు ఈ నల్లగుట్ట గురించి ❗
ఇప్పుడు ఈ నల్లగుట్ట గుహలలో పాండురంగ స్వామి వెలసినటువంటి దాని గురించి తెలుసుకుందాం
- ఈ నల్లగుట్ట గుహలలో పాండురంగ స్వామి స్వయంభుగా వెలిసి ఉన్నాడు పాండురంగ స్వామి రాతి సాలిగ్రామ రూపములో వెలసి ఉన్నాడు
ఈ సాలిగ్రహము రాయి కూడా ఎంతో అరుదైనది ప్రపంచంలో కేవలం నేపాల్ గండకి నదిలో మాత్రమే ఇది లభిస్తుంది. అలాంటి శాలిగ్రహ విగ్రహం నల్లకోండ గుహలలో పాండురంగ స్వామి రూపంలో వెలిసి ఉంది. దీనినే Self Manifestation of Lord Vitthal in the form of Saligraha అంటాము దాదాపు నాలుగు వందల మిలియన్ సంవత్సరాల పూర్వం ఈ భూమిపై ఇంకా మానవజాతి ఏర్పడక ముందే ఒక జీవి ఉద్భవించి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంతరించిపోయింది దాని పేరే Ammonites ఆ జీవి అవశేషాలతోనే ఏర్పడినవి ఈ శాలిగ్రహము విగ్రహం సహజంగా ఇందులో విష్ణుమూర్తికి చెందిన శంఖచక్రాలు కనిపించడంతో దీనిని ఆధ్యాత్మికంగా కూడా ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు వైదిక వైష్ణవ హైందవంలో.
అంతేకాకుండా పాండురంగ శాలిగ్రహ రూపము రెండు కాళ్ళ మధ్య ఒక సన్నటి రంధ్రంతో భూమి లోతుల్లోపాతాళానికి దాదాపు 100 నుంచి 150 మీటర్ల లోతులో సహజ సిద్ధంగా ఒక పుట్ట ఉంది ఇక్కడ ఎన్నో వివిధ రకాల జంతు జాతికి నివాసం మార్గం Reptiles Life
సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ భూమి పాతాళము నుండి ఎన్నో రకరకాలు Reptiles నివసిస్తూ ఉంటాయి అతి ముఖ్యముగా ఆ పాండురంగ స్వామి సర్ప రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు.
అందుకే ఈ దేవాలయానికి ప్రముఖ పేరుతో పిలుస్తూ ఉంటారు
సర్పగండిక పుట్ట శిలా నల్లగుట్ట పాండురంగ దేవాలయం
🖊️మీ హరి ప్రసాద్🙏🏻🌹
Comments
Post a Comment